V6 News

155313 నంబర్ పని చేయలే..ట్యాంకర్లు బుక్ కాక వాటర్ బోర్డు కస్టమర్ల పరేషాన్ 

155313 నంబర్ పని చేయలే..ట్యాంకర్లు బుక్ కాక వాటర్ బోర్డు కస్టమర్ల పరేషాన్ 
  • పునరుద్ధరించిన బీఎస్ఎన్ఎల్​

హైదరాబాద్​సిటీ, వెలుగు: వాటర్​బోర్డు టోల్​ఫ్రీ నంబర్ రెండ్రోజులుగా​పని చేయకపోవడంతో ట్యాంకర్ బుకింగ్​చేయడానికి వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. కస్టమర్​ కేర్​నంబర్​155313 కాల్​చేసినా టెక్నికల్ ఇష్యూస్​తో నంబర్​కలవక తిప్పలు పడ్డారు. సమస్యను పరిష్కరించేందుకు బీఎస్ఎన్ఎల్​ టెక్నికల్​టీం రంగంలోకి దిగి గురువారం సాయంత్రానికి నంబర్​ను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. 

ఇలా కూడా బుక్​చేసుకోవచ్చు.. 

కేవలం టోల్​ఫ్రీ నంబర్​తోనే కాకుండా మరికొన్ని ప్రత్యామ్నాయ మార్గాల్లోనూ ట్యాంకర్లను బుక్​చేసుకోవచ్చని వాటర్​బోర్డు చెప్పింది. వాటర్​బోర్డు అధికారిక వెబ్​సైట్​లో లాగిన్ అయి, అడిగిన వివరాలు ఎంట్రీ చేసి బుక్​చేసుకోవచ్చన్నారు. అలాగే,  హెచ్​ఎండబ్ల్యూఎస్​ఎస్​బీ మొబైల్ యాప్ ద్వారా కూడా బుక్​చేసుకోవచ్చని చెప్పారు. లేకపోతే సమీప వాటర్​బోర్డు ఆఫీస్​లో లేదా వాటర్​సప్లయ్​చేసే ఆఫీస్​కు వెళ్లి కూడా పొందవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక లైన్ మన్ ను లేదా ఫీల్డ్ స్టాఫ్‌‌‌‌ను కూడా సంప్రదించి సేవలు పొందవచ్చన్నారు.